వంగపల్లి లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
ప్రజావాణి అక్టోబర్ 26 కమలాపూర్ మండల్ వంగపల్లి గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకలను వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వాల్మీకి జయంతిని పురస్కరించుకొని సంఘం సభ్యులు గ్రామస్తులు కలిసి జెండాను ఆవిష్కరించి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ కార్యక్రమానికి ఎస్ఐ మధు ముఖ్య అతిథిగా హాజరై మహర్షి వాల్మీకి గొప్పతనం ఆయన రచించిన రామాయణం విశిష్టతను వివరించారు వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఆయన చూపిన సన్మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు
యువత డ్రగ్స్ మారకద్రవ్యాలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్సై మధు పిలుపునిచ్చారు విద్య మంచి ఆలోచనలు ఆధ్యాత్మిక విలువలతో ముందుకు సాగుతూ సమాజానికి ఉపయోగపడే విధంగా జీవితాన్ని ఎదుర్కోవాలని సూచించారు వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి సమాజానికి గొప్ప సందేశాన్ని అందించినట్లే యువత కూడా తమ ప్రతిభను సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు
అలాగే వాల్మీకి సామాజిక వర్గీలంతా ఐక్యంగా ఉంటూ సంఘం అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు వాల్మీకి మహర్షి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నకిర్త రాజు రెండో వార్డు సభ్యులు శనిగరపు రవీందర్ మూడో వార్డు సభ్యులు అనిల్ గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు వాల్మీకి సంఘం గౌరవ అధ్యక్షులు పెనుకుల సారయ్య అధ్యక్షులు పున్నం చందర్ ఉపాధ్యక్షులు నరేందర్ క్యాషియర్ పెంకుల సాంబయ్య వర్గం పెద్దమనుషులు పెనుకుల కొండలు పెనుకుల రవి పెనుకుల సాంబయ్య మండల ఓదెలు పెనుకుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

