లో వోల్టేజీతో కాలిపోతున్న వ్యవసాయ మోటార్లు
అంతరాయం లేని విద్యుత్ సరఫరా కల్పించాలి
* ప్రభుత్వంవిద్యుత్ అధికారులను కోరిన రైతు ఏనుగు గోపాల్ రెడ్డి
జమ్మికుంట అక్టోబర్ 9 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లాఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లి గ్రామంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, తక్కువ వోల్టేజీ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని గ్రామానికి చెందిన రైతు ఏనుగు గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వోల్టేజీ కారణంగా వ్యవసాయ బావులకు అమర్చిన మోటార్లు కాలిపోతున్నాయని, దీంతో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలను కాపాడుకోవడం కష్టంగా మారిందని ఆయన వాపోయారుఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వరి పంటలు చివరి దశలో ఉన్నాయని, ఈ సమయంలో పంటలకు నిరంతరాయంగా నీరు అందించడం ఎంతో అవసరమని తెలిపారు. అయితే తమ గ్రామంలో రోజుకు పది గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదని, వచ్చిన కరెంటు సైతం తక్కువ వోల్టేజీతో ఉండటంతో పొలాలకు సక్రమంగా నీరు పారడం లేదని పేర్కొన్నారు. దీంతో వరి పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారువిద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతోపాటు తక్కువ వోల్టేజీ కారణంగా వ్యవసాయ బావులకు అమర్చిన మోటార్లు కాలిపోతున్నాయని తెలిపారు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు రైతులు అదనపు మోటార్లు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, అయినప్పటికీ విద్యుత్ సమస్యల కారణంగా నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారుగతంలో రోజుకు 18 గంటలపాటు విద్యుత్ సరఫరా జరిగేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గోపాల్ రెడ్డి పేర్కొన్నారు గతంలో మాదిరిగానే రోజుకు 18 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ అధికారులను కోరారురైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టి వ్యవసాయం చేస్తున్నారని, పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్ సమస్యల కారణంగా పంటలు ఎండిపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికే పెట్టుబడుల భారం, సాగు ఖర్చులతో సతమతమవుతున్న రైతులకు విద్యుత్ సమస్యలు మరింత ఇబ్బందికరంగా
మారుతున్నాయనితెలిపారుఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి రాత్రింబవళ్లు అంతరాయాలు లేకుండా, తగిన వోల్టేజీతో విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పంటలు పూర్తిస్థాయిలో పండాలంటే సకాలంలో నీరు అందడం అత్యంత ముఖ్యమని, విద్యుత్ సరఫరాలో సమస్యలు కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని గోపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

