📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలక్ష్మక్కపల్లిలో మారుతి వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి

లక్ష్మక్కపల్లిలో మారుతి వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

లక్ష్మక్కపల్లిలో మారుతి వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): జిల్లా లోని
కొడకండ్ల మండలం, లక్ష్మక్కపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నూతనంగా ఏర్పాటు చేసిన మారుతి వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ హన్మాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాటర్ ప్లాంట్ నిర్వాహకులు శ్రీనివాస్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛమైన తాగునీరు ఎంతో అవసరమని, ఇలాంటి వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజలకు సురక్షితమైన, శుద్ధి చేసిన తాగునీరు తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని అన్నారు. వ్యాపారంతో పాటు సేవా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజలంతా స్వచ్ఛమైన నీటిని తాగి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాటర్ ప్లాంట్ యాజమాన్యం, స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.