📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadప్రభుత్వ హైస్కూల్లో తేనెటీగల ముప్పు

ప్రభుత్వ హైస్కూల్లో తేనెటీగల ముప్పు

📰 Generate e-Paper Clip

 

 

అదమరిస్తే విద్యార్థుల ప్రాణాలకు పెను ప్రమాదమే

 

*పట్టించుకోని పాఠశాల ప్రిన్సిపాల్*

*మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్న స్థానికులు,విద్యార్థులు*

తొర్రూర్
అక్టోబర్ 12

తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో వేప చెట్టుకు తేనెటీగల తొట్టె కలిగి ఉండడంతో, ఏ క్షణంలోనైనా తేనెటీగలు విద్యార్థులపై దాడి చేసే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్ కూడా దీన్ని గమనించకుండా ఉండడం చర్చనీ అంశంగా మారింది. పిల్లలు తరగతి గదిలో చదువుకునే సమయంలో తేనెటీగలు ఏదైనా పక్షి కదలికలతో తేనెటీగలు లేచినట్లయితే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని స్థానికులు చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా హై స్కూల్ ప్రాంగణం లో అనేకమంది క్రీడ ప్రాంగణంలో ఆడుకునే పిల్లలకు, నిరంతర వాకింగ్ కు వస్తున్న వాకర్స్ కు , ప్రమాదం పొంచి ఉంది. ఇది పబ్లిక్ ప్లేస్ కావడంతో, ఎండలో వచ్చిన పాదాచారు లు కూడా ఇక్కడ సేద తీర్చుకోవడం జరుగుతుంది. ఈ తేనెటీగల యొక్క తొట్టెలను ఎవరు గమనించకపోవడం వలన, సోమవారం మధ్యాహ్నం సమయంలో కూడా, కొంతమంది పై దాడి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కావున స్థానిక మున్సిపల్ అధికారులు, వెంటనే స్పందించి ప్రభుత్వ పాఠశాలలో వేప చెట్లపై ఉన్న తేనెటీగల తొట్టెలను తొలగించి, వాటి బారిన పడకుండా విద్యార్థులను స్థానిక ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.