📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్రూఫ్‌టాప్ సోలార్‌పై అవగాహన కార్యక్రమాలు

రూఫ్‌టాప్ సోలార్‌పై అవగాహన కార్యక్రమాలు

📰 Generate e-Paper Clip

రూఫ్‌టాప్ సోలార్‌పై అవగాహన కార్యక్రమాలు

మేడ్చల్, అక్టోబర్ 2: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన (సేవా సేతు అభియాన్)లో భాగంగా ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్ల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు మేడ్చల్ డీఈ కార్యాలయం/వినియోగదారుల సేవా కేంద్రంలో ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని విద్యుత్ శాఖ మేడ్చల్ డీఈ జాన్ పోతురాజు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్ల ఏర్పాటు, సౌర విద్యుత్ వినియోగం, ప్రభుత్వం అందించే సబ్సిడీ ప్రయోజనాలు, పథకానికి సంబంధించిన ఇతర అంశాలపై వినియోగదారులకు అధికారులు వివరాలు అందించనున్నారు. ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ను వినియోగించుకోవడంతో పాటు, ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.