*మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయం*
మేడ్చల్, అక్షిత ప్రతినిధి:
మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ జాము రవి అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ దేశానికి అందించిన సేవలను, అహింసా సిద్ధాంతాన్ని, సత్యం, శాంతి మార్గంలో ఆయన చూపిన బాటను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు నీరజ్ గౌడ్, నవీన్, అజయ్ కుమార్, ప్రభాకర్, రాజు, గోవర్ధన్ రెడ్డి, లత, శ్రీలత, లత, నాయకులు వెంకట నరసింహారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నర్సింలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, గౌతమి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మోహన్ సింగ్, బిల్ కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

