📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైన మోడల్ పాఠశాల విద్యార్థిని

రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైన మోడల్ పాఠశాల విద్యార్థిని

📰 Generate e-Paper Clip

*రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైన మోడల్ పాఠశాల విద్యార్థిని*

* *మన ప్రజావాణి* *మందమర్రి:-*

తెలంగాణ రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు పట్టణంలోని పిఎంశ్రీ తెలంగాణ ఆదర్శ (మోడల్) పాఠశాల, జూనియర్ కళాశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని జి అనూ ఎంపికైంది. బుధవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నీమ్ మాట్లాడుతూ, అక్టోబర్ 26 న నిర్వహించిన జోనల్ స్థాయి ఫుట్ బాల్ క్రీడా పోటీల్లో అనూ మంచి ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిందని తెలిపారు. మెదక్ లో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో అనూ పాల్గొననుందని తెలిపారు. మోడల్ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థిని అనూ క్రీడల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు, తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణమన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల తరపున నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సైతం ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా విద్యార్థిని అనూ, పీఈటీ ఎం చిన్నక్క లను ప్రత్యేకంగా అభినందించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.