📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతూముచౌదరి ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి పుట్టినరోజు వేడుకలు

తూముచౌదరి ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి పుట్టినరోజు వేడుకలు

📰 Generate e-Paper Clip

*తూముచౌదరి ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి పుట్టినరోజు వేడుకలు..*

*కేక్ కటింగ్ చేసి, మంత్రికి జన్మదిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తూముచౌదరి..*

*పుట్టినరోజు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..*

*పొంగులేటిని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించిన లక్ష్మీదేవిపల్లి ప్రజలు*

లక్ష్మీదేవిపల్లి, అక్టోబర్ 28 (మన ప్రజావాణి): భద్రర్ధి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తూము చౌదరి ఆధ్వర్యంలో గృహ నిర్మాణ, రెవిన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకను సంబరాలుగా అత్యంత ఘనంగా నిర్వహించారు. పొంగులేటి జన్మదిన ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండల కేంద్రంలోని పాలకేంద్రంలో భారీ ఎత్తున ‘మహా అన్నదాన కార్యక్రమాన్ని’ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూము చౌదరి, టిపిపిసి సభ్యులు జేబీ సౌరి పాల్గొని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తూము చౌదరి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు లక్ష్మీదేవిపల్లి మండలంలో నిర్వహిస్తున్నామని, గత సంవత్సరంలో 11 చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని, ఇప్పుడు కూడా వివిధ చోట్ల అన్నదాన కార్యక్రమాలు, బుధవారం రోజు సాయంత్రం అన్ని పంచాయతీలలో కేక్ కటింగ్ కార్యక్రమాలు జరుగుతాయని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయురారోగ్యాలుతో సంతోషంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, జిల్లా మైనార్టీ నాయకులు ఎం.డి. గౌస్ పాషా, చుంచుపల్లి మాజీ మండల అధ్యక్షుడు పాల్, లక్ష్మీదేవిపల్లి మండల నాయకులు యాసారపు నరసింహారావు, మాజీ సర్పంచ్ బలరాం, ధారావత్ దూబులో, ధారావత్ గణేష్ నాయక్, సర్పంచ్ లు అజ్మీర లైలా, తాటి అనిత, మాలోత్ భారతి, బానోత్ రాణి, కోరం మమత, మలకం లక్ష్మి, వాంకుడోత్ హథిరాం, బట్టు అరుణ్, బోడ సంతు, బానోత్ జానీ, నునావత్ సేవ, ధరావత్ బుజ్జి, లావుడియా పూర్ణ, బానోత్ రమేష్, మాజీ సర్పంచ్ తాటి పద్మ, ఉప సర్పంచ్ మహేష్, తాటి తిరుమలేష్, ఎండి అప్సర్ ఖాన్, కుంజా సూరిబాబు, అంత డబ్బుల కృష్ణ, ఐకి సత్యనారాయణ, గుంపుల మహేష్, మైనార్టీ నాయకులు నయీమ్, బాసిద్, కృష్ణార్జునరావ్, జీడి మహేష్, శనగవరపు నగేష్, కుమార్ 49వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.