కడప జిల్లా పోరుమామిళ్ల ప్రజావాణి (అక్టోబర్ 27): శ్రీ వైష్ణవి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.పాఠశాలకు చెందిన అండర్-14 బాలికల విభాగంలో రోషిని హైజంప్,లాంగ్ జంప్ పోటీలకు ఎంపిక కాగా,అండర్-17 బాలుర విభాగంలో రమణ 400 మీటర్ల పరుగు పందెం పోటీకి ఎంపికయ్యాడు.వీరు కర్నూలులో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు.అదేవిధంగా,బాస్కెట్బాల్ విభాగంలో అండర్-14 క్రీడాకారుడు ఈశ్వర్,అండర్-17 క్రీడాకారుడు మన్విత ఎంపికై తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీ ఆర్.వి.రామకృష్ణ, కళ్యాణి మేడం ఎంపికైన విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను,వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.శ్రీ వైష్ణవి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థుల విజయాల పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల విజయమే పాఠశాల గర్వం!
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పోరుమామిళ్ల శ్రీ వైష్ణవి పాఠశాల విద్యార్థుల ఎంపిక
RELATED ARTICLES

