📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialరాజారాంపల్లిలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి మండల నాయకులు

రాజారాంపల్లిలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి మండల నాయకులు

📰 Generate e-Paper Clip

జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి సెప్టెంబర్ 30 (ప్రజావాణ

రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని వివేకానంద కూడలి వద్ద మంగళవారం బిజెపి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొమ్ము రాంబాబు పాల్గొని మాట్లాడారు…. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఒక వర్గాన్ని మెప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి దిక్కుమాలిన ఉపన్యాసాలు ఇస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపై ఆయనకు ధ్యాస లేదని తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అబద్ధపు హామీల్లో కనీసం ఒకటైనా నెరవేర్చాలన్న కనీస జ్ఞానం ముఖ్యమంత్రికి లేకపోవడం విచారకరమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థాయిని విమర్శించే అర్హత గానీ, ఆయన భక్తి గురించి మాట్లాడే హక్కు గానీ సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అపర శివభక్తుడని, దేశంలోని అనేక శైవ క్షేత్రాలను దర్శించుకున్నారని గుర్తుచేశారు. స్వయంగా పరమశివుడు కొలువుదీరిన కాశీ క్షేత్రానికే మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయాన్ని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, అసలు సీఎం రేవంత్ రెడ్డి హిందువేనా అని ఈ సందర్భంగా నిలదీశారు. హిందూ సనాతన ధర్మంపై రేవంత్ రెడ్డి చేసే జిమ్మిక్కులు, యుక్తులు ఏమాత్రం ప్రభావం చూపవని పేర్కొన్నారు. శ్రీరామచంద్రుడికి, పరమశివుడికి మధ్య భేదభావాలు చూపే వారికి మళ్లీ రాజయోగం దక్కదని వేద పండితులు స్పష్టం చేశారని తెలిపారు. గతంలో కేసీఆర్ కూడా రావణ రాజ్యం, శూర్పణఖ రాజ్యం అంటూ మాట్లాడి, చివరకు కుటుంబ తగాదాల సాలెగూటిలో చిక్కుకుని పదవిని కోల్పోయారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్తులో అదే పరిస్థితి ఎదురవ్వడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మంచుకట్ల రవి, పొన్నం నరేష్, మేడిపల్లి రాజశేఖర్, మండల ఉపాధ్యక్షుడు గోపనవేని గంగాచలం, ఓబిసి మోర్చా అధ్యక్షుడు అమరగొండ దివాకర్ గౌడ్, బిజెవైఎం అధ్యక్షుడు జక్కుల సాగర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవి సంతోష్, బిజెవైఎం ప్రధాన కార్యదర్శి మేడిపల్లి రాజు, మండల సీనియర్ నాయకులు జిట్టవేని రమేష్, ఏలేటి భాస్కర్ రెడ్డి, బూత్ అధ్యక్షులు కుశనపల్లి నరేష్, కొదురుపాక అశోక్, మండల నాయకులు దాసరి మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.