పీర్జాదిగూడ, సెప్టెంబర్ 30 (ప్రజావాణి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మేడికొండ శాంసన్ జార్జ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా శాంసన్ జార్జ్‌ను వజ్రేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ కావలి చంద్రయ్య అభినందించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు శాంసన్ జార్జ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు 10వ డివిజన్లో ఎస్సీ సెల్‌ను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్తానన్నారు.
డివిజన్లోని కాలనీల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. యువతలో క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించేలా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి జెలేంద్ర రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు వి. ప్రభాకర్ రెడ్డి, 10వ డివిజన్ అధ్యక్షుడు బండి శ్రీరాములు గౌడ్, 9వ డివిజన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, కొల్తూరి సాయి, వి. పరమేష్, మాణికుమార్, బొల్లేడు సంతోష్, బిళ్లనూరు కమలాకర్, మేడికొండ రావుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

