📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణయువత సన్మార్గంలో పయనించాలి పోలీస్ ఆధ్వర్యంలో మామిడి తోటలో మార్గ నిర్దేశం

యువత సన్మార్గంలో పయనించాలి పోలీస్ ఆధ్వర్యంలో మామిడి తోటలో మార్గ నిర్దేశం

📰 Generate e-Paper Clip

యువత సన్మార్గంలో పయనించాలి పోలీస్ ఆధ్వర్యంలో మామిడి తోటలో మార్గ నిర్దేశం

ప్రజావాణి అక్టోబర్ 15 కమలాపూర్ మండల్ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని యువతను సన్మార్గంలో నడిపించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గూడూరు శివారులోని మామిడి తోటలో మార్గ నిర్దేశనం పేరిట ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కమలాపూర్ మండల్ లోని అన్ని గ్రామాల నుంచి ప్రతి గ్రామానికి దాదాపు పది నుంచి 15 మంది యువకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు

యువతే దేశానికి పట్టుకొమ్మలు

ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన ఘనత మన దేశానిదే యువతే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు అయితే కొందరు యువకులు దారి తప్పి బలహీనతకు లోన్ అవుతుండడం ఆందోళనకరం అని పేర్కొన్నారు ముఖ్యంగా సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి మద్యం వ్యసనాలు మరియు ఆధునిక కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల యువత అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు సన్మార్గంలో పయనిస్తే సాధించే విజయాలు చెడు మార్గంలో వెళ్తే కలిగే పరిణామాలపై యువకులకు దిశా నిర్దేశం చేశారు

పెద్దన్నగా పోలీస్ శాఖ తోడ్పాటు

యువతకు కేవలం పోలీసులు గానే కాకుండా కుటుంబంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ వారికి నిరంతరం మార్గ దర్శనం చేసేందుకు పోలీస్ వ్యవస్థ సిద్ధంగా ఉందన్నారు గ్రామంలోని వ్యక్తులే కాకుండా పశు పక్షాలు పకృతి పర్యావరణం అన్ని సుభిక్షంగా ఉండి ఈ మండలం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నది తమ ఆకాంక్ష అని తెలిపారు

పంచభూతాల సాక్షిగా ప్రమాణం

ఈ అవగాహన కార్యక్రమానికి స్పందించిన యువకులు పచ్చని చెట్లు మరియు పంచభూతాల సాక్షిగా సామూహిక ప్రయాణం చేశారు ఈ గ్రామాన్ని మా కుటుంబాన్ని మేము కాపాడుకుంటాం వ్యసనాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తును చక్కదిద్దుకుంటాం Sbse హృదయపూర్వకంగా మాటిచ్చారు ఈ సందర్భంగా వ్యక్తి అయినా సానుకూల వాతావరణం నిరంతరం కొనసాగాలని అధికారులు కోరారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.