*యడవల్లి లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ*
ముదిగొండ సెప్టెంబర్ 2 ప్రజావాణి ప్రతినిధి
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిఫార్సుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం ఆర్ ఎఫ్) చెక్కులను యడవల్లి గ్రామంలో లబ్ధిదారులకు అందజేశారు.గ్రామానికి చెందిన ఐతనబోయిన లక్ష్మి (భర్త: కొండలు), షేక్ ఆశ (భర్త: సలీం పాషా)లకు సర్పంచ్ భారతమ్మ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చెరుకుపల్లి రాంబాబు, ఉప సర్పంచ్ ఉపేందర్ చేతుల మీదుగా ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో భరోసానిస్తుందని, నిధులు మంజూరు చేయించిన ఎంపీ రఘురాం రెడ్డికి లబ్ధిదారులు, గ్రామ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

