మేడ్చల్ నియోజకవర్గ జవహర్నగర్ డివిజన్లలో సమస్యలపై వినతి పత్రం అందుచేత :
జవహర్ నగర్, అక్టోబర్ 16 (ప్రజావాణి ప్రతినిధి ):
జవహర్ నగర్ లో ఎదుర్కొంటున్న డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, సీసీ రోడ్లు, పారిశుధ్యం తదితర మౌలిక సమస్యలను పరిష్కరించే దిశగా మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ మేయర్,శ్రీమతి మేకల కావ్య, మరియు బి.ఆర్.ఎస్. పార్టీ అధ్యక్షుడు బాషావోని కొండల్ ముదిరాజ్, కలిసి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, కలిసి సమస్యలను వివరించారు,
ఈ సందర్భంగా కమిషనర్ గారికి వినతి పత్రాలను అందజేసి, కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా వివరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరడం జరిగింది.
దీనిపై కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు అల్లూరి సంగీత రాజశేఖర్,పల్లపు రవి,మరియు బండి నవీన్ గౌడ్ తధితరులు పాల్గొన్నారు..
ప్రజల సమస్యలే మా ప్రాధాన్యత ప్రజల సంక్షేమమే మా లక్ష్యం! అని కొండల్ ముదిరాజ్ అన్నారు,

