📄 ePaper
Epaper 2
Saturday, October 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మేడ్చల్ గడిమైసమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

మేడ్చల్ గడిమైసమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

*మేడ్చల్ గడిమైసమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు*

*శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు*

మేడ్చల్,ప్రజావాణి:- మేడ్చల్‌ డివిజన్ పరిధిలోని ప్రసిద్ధ శ్రీ గడిమైసమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది. ఈ సందర్భంగా ప్రముఖ జానపద గాయని వీణ, సంగీత దర్శకుడు, గాయకుడు భవాని శంకర్ కుటుంబ సమేతంగా గడిమైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మేడ్చల్ గడిమైసమ్మ తల్లి ఎంతో మహిమాన్వితమైన అమ్మవారని తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఆ తల్లి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో జీవించాలని, అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు.

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుండటంతో భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనం, పూజా కార్యక్రమాలతో మేడ్చల్ గడిమైసమ్మ ఆలయంలో భక్తిభావం వెల్లివిరుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.