మేడ్చల్ గడిమైసమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

*మేడ్చల్ గడిమైసమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు* *శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు* మేడ్చల్,ప్రజావాణి:- మేడ్చల్‌ డివిజన్ పరిధిలోని ప్రసిద్ధ శ్రీ గడిమైసమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక...