📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు

మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

*మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు*

కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 28

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను అశ్వారావుపేట మున్సిపాలిటీలోని మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజలకు సేవలందిస్తూ వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.ముఖ్యంగా రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో మంత్రి కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు ప్రశంసించారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ, వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకుడిగా ఆయన ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజలకు మరిన్ని సేవలందిస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని అశ్వారావుపేటలో నిర్వహించిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు. స్టేట్ యూత్ కమిటీ అధ్యక్షులు జూపల్లి కోదండ వెంకట రామారావు, జిల్లా నాయకులు తుమ్మ రాంబాబు, కాంగ్రెస్ నాయకులు జూపల్లి ప్రమోద్, కాసాని పద్మశేఖర్, నండ్రు రమేష్, కానూరి మోహన్ రావు, తాడేపల్లి రవి, వెలుపుల సత్యనారాయణ, కర్ణాటక శ్రీను, సర్పంచ్ కుంజా శ్రీను, గుజ్జా సంకూర్ రావు అశ్వారావుపేట మున్సిపల్ కౌన్సిలర్లు మిండా హరిబాబు, నార్లపాటి దివాకర్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.