📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguమీ గమ్యం త్వరగా చేరుకోవడం కంటే.. సురక్షితంగా గమ్యం చేరడమే ముఖ్యం

మీ గమ్యం త్వరగా చేరుకోవడం కంటే.. సురక్షితంగా గమ్యం చేరడమే ముఖ్యం

📰 Generate e-Paper Clip

.పస్రా ఎస్ఐ తాజుద్దీన్

*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-
రోడ్డుపై కొన్ని నిమిషాలు ఆదా చేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టవద్దని పసర పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ములుగు జిల్లా వ్యాప్తంగా రాంగ్ రూట్ ప్రయాణాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఆటో, షేర్ ఆటో, క్యాబ్, బైక్ ఏ వాహనంలో ప్రయాణిస్తున్నా డ్రైవర్ రాంగ్ రూట్ లో వెళ్లేందుకు ప్రయత్నిస్తే వెంటనే వద్దని చెప్పాలని సూచిస్తున్నారు.
గోవిందరావుపేట సబ్ ఇన్స్పెక్టర్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
మీ గమ్యం త్వరగా చేరుకోవడం కంటే, సురక్షితంగా గమ్యం చేరడమే ముఖ్యం” అని పోలీసులు పేర్కొన్నారు.
రాంగ్ రూట్ వల్ల ఎదురెదురు ఢీకొని ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.