మాజీ ప్రధాని”లాల్ బహదూర్ శాస్త్రి”జయంతిని విస్మరించవద్దు..
ప్రజావాణి,ఇనుగుర్తి: భారత దేశ రెండవ మాజీ ప్రధాని, భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని విస్మరించవద్దని ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు మార్క నరేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహాత్మా గాంధీ పిలుపుమేరకు ఉప్పు సత్యాగ్రహం,క్విట్ ఇండియా వంటి స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని జైలు శిక్ష అనుభవించి స్వాతంత్ర్య అనంతరం రైల్వే మంత్రిగా పనిచేశారని ఒక చిన్న రైలు ప్రమాదానికే తన పదవికి బాధ్యత వహించి రాజీనామా నిజాయితీపరుడని పేర్కొన్నారు. దేశానికి రెండవ ప్రధానిగా ఎంతో సేవ చేశారన్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ను మట్టి కనిపించి దేశాన్ని నడిపించిన మహా నేతని చెప్పారు.జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని తీసుకువచ్చి జవాన్లతో సమానంగా రైతుల సేవలు వెలకట్టలేనివని చెప్పారని గుర్తు చేశారు. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఒకే రోజైనప్పటికీ ఇద్దరు జయంతులు జరపాలని ఆదేశాలు ఇవ్వకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.ఇక ముందైనా శాస్త్రి జయంతిని అధికారికంగా జరపాలని సూచించారు.

