📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకులకచర్లలో మహిళ అదృశ్యం

కులకచర్లలో మహిళ అదృశ్యం

📰 Generate e-Paper Clip

కులకచర్లలో మహిళ అదృశ్యం: ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

పరిగి అక్టోబర్02 (ప్రజావాణి)

కులకచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్ గ్రామానికి చెందిన గంధం అమృతమ్మ (34) అనే మహిళ అదృశ్యమైనట్లు కుల్కచర్ల పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దివంగత భీమయ్య భార్య అయిన అమృతమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గత నెల 18న (18.09.2026) మధ్యాహ్నం సుమారు 12:00 గంటల ప్రాంతంలో చెల్లాపూర్ గ్రామం నుండి కుల్కచర్లలోని తన ఇంటిని చూసి వస్తానని చెప్పి బయలుదేరింది. అయితే ఎంత సమయమైనా ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.
దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కుల్కచర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై వి. రమేష్ తెలిపారు.
ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి:
అమృతమ్మ ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.
* కేసు దర్యాప్తు అధికారి (ఎస్సై వి. రమేష్): 8712670044
* కుల్కచర్ల పోలీస్ స్టేషన్: 8712670372
* ఫిర్యాదుదారు ఫోన్ నంబర్: 7569530800

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.