📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadమాజీ చైర్మన్ సోమశేఖరరావు రూ.2 నుంచి 3 కోట్ల నిధుల దుర్వినియోగ ఆరోపణలు.

మాజీ చైర్మన్ సోమశేఖరరావు రూ.2 నుంచి 3 కోట్ల నిధుల దుర్వినియోగ ఆరోపణలు.

📰 Generate e-Paper Clip

మాజీ చైర్మన్ సోమశేఖరరావు రూ.2 నుంచి 3 కోట్ల నిధుల దుర్వినియోగ ఆరోపణలు.

ఆయన 51 ఎంక్వయిరీపై స్టే తొలగించి నిర్దోషిత్వం నిరూపించుకోవాలి.

56 పేజీల ఆధారాలు ఉన్నాయన్న రైతులు.

6,500 క్వింటాళ్ల వడ్ల కొనుగోళ్లలో రూ.కోటి బిల్లుల అక్రమం.

వాహన ఖర్చు రూ.10.61 లక్షలు, విమాన ప్రయాణం రూ.4.95 లక్షలు.

51 ఎంక్వయిరీ రీఓపెన్ కాకుడదనే పదవి కోసం తాపత్రయం.

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించే అభ్యర్థికే మా మద్దతు.

ఎత్తొండ క్యాంపులో పీఏసీఎస్ చైర్మన్ పదవిపై ఐదు గ్రామాల రైతుల ప్రెస్ మీట్.

కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం ఎత్తొండ క్యాంప్‌లో ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ పదవికి సంబంధించి రైతులు సమావేశం గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌ ఆనంద్‌, పలువురు రైతులు మాట్లాడారు.గత నెల రోజులుగా ఎత్తొండ సొసైటీ చైర్మన్‌ పదవికి సంబంధించి పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నప్పటికీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచనలను గౌరవిస్తూ తాము ఇప్పటివరకు మౌనంగా ఉన్నామని వారు తెలిపారు.సొసైటీ మాజీ చైర్మన్‌ కొత్త సోమశేఖర రావు గతంలో సొసైటీకి సంబంధించిన వ్యవహారాల్లో అవినీతి,అక్రమాలకు పాల్పడ్డారంటూ పలు ఆరోపణలు ఉన్నాయని రైతులు పేర్కొన్నారు.ఈ ఆరోపణలపై 51 ఎంక్వయిరీ జరిగినప్పటికీ దానిపై కోర్టు నుంచి స్టే పొందినట్లు వారు తెలిపారు. ఆరోపణలు నిజం కాదని భావిస్తే 51 ఎంక్వయిరీ పై ఉన్న స్టేను తొలగించుకుని రైతుల సమక్షంలో తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని వారు కోరారు. సొసైటీకి సంబంధించిన వ్యవహారాల్లో సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపణలు ఉన్నాయని.దీనికి సంబంధించి తమ వద్ద 56 పేజీల పత్రాలు ఉన్నాయని రైతులు తెలిపారు.సొసైటీ పరిధిలో పనిచేసే కొందరు వ్యక్తులు,వారి బంధువుల పేర్లపై సుమారు 6,500 క్వింటాళ్ల వడ్ల కొనుగోళ్లకు సంబంధించి దాదాపు రూ.కోటి విలువైన బిల్లుల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపించారు.ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తులను ప్రశ్నించగా తాము వడ్లు విక్రయించ లేదని,బిల్లులు తీసుకోలేదని చెప్పారని దీనిపై సోమశేఖరరావు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.అలాగే తన వాహన ఖర్చుల కింద రూ.10,61,685, విమాన ప్రయాణానికి రూ.4,95,501 సొసైటీ నుంచి ఖర్చు చేసినట్లు విచారణ లో పేర్కొన్నట్లు రైతులు తెలిపారు.ఈ మొత్తాలను రికవరీ చేయాలని విచారణ లో సూచించినట్లు పేర్కొన్నారు.సొసైటీ నిధులతో ఐఫోన్‌ కొనుగోలు చేసినట్లు కూడా ఆరోపించారు. సొసైటీ నిధుల వినియోగానికి సంబంధించి నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.గత పాలక వర్గంపై కూడా 51 ఎంక్వయిరీ, క్రిమినల్‌ కేసులు నమోద య్యాయని.ఒక్కొక్కరి నుండి 97 లక్షల నిధుల రికవరీకి ఆదేశాలు వచ్చిన విషయాన్ని రైతులు ప్రస్తావించారు.అలాంటప్పుడు సోమశేఖరరావుపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కూడా విచారణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఒకసారి సొసైటీ చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తి తిరిగి అదే పదవిని చేపట్టడంపై నిబంధన లకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలించాలని రైతులు అన్నారు.తనపై ఉన్న 51వ విచారణను ఎదుర్కొని ఆరోపణల నుంచి నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న అనంతరం చైర్మన్‌ పదవికి పోటీ చేయాలని వారు సూచించారు.చట్టాలు,యాక్టులన్నీ తెలిసిన సోమశేఖర రావు తనపై ఉన్న 51వ ఎంక్వయిరీ రీఓపెన్ కాకుండా ఉండటానికే ఆయన ఈ చైర్మన్ పదవి కోసం తాపత్రయపడుతున్నారనే విషయాన్ని రైతులందరూ ముఖ్యంగా గమనించాలని సూచించారు.గ్రామం లోని పలువురు పెద్దలు సోమశేఖర రావుకు పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవి దక్కకుండా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అడ్డుపడుతున్నారని చెబుతున్నారని.ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డిని స్వయంగా సోమశేఖర రావు కలిసి తనకు చైర్మన్‌ పదవి ఇవ్వాలని కోరారా సంప్రదించారా అని ప్రశ్నించారు.ప్రస్తుతం పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవి నామినేటెడ్‌ విధానంలో ఎంపిక జరుగుతున్నందున,పదవిని ఆశిస్తున్న వ్యక్తి సంబంధిత ఎమ్మెల్యేను కలిసి తన అభ్యర్థిత్వాన్ని తెలియజేయడం అవసరమని వారు అన్నారు.సంఘం పరిధిలోని కాంగ్రెస్‌ కార్యకర్తలకే చైర్మన్‌ పదవి ఇవ్వాలని పలువురు కోరిన నేపథ్యంలో సోమశేఖర రావు పేరు మినహా మరెవరిపేరును ప్రతిపాదించినా ఐదు నిమిషాల్లో చైర్మన్‌గా ప్రకటిస్తానని పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన విషయం అందరికీ తెలిసిందేనని రైతులు పేర్కొన్నారు.చైర్మన్‌ పదవి విషయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎవరి పేరును ప్రతిపాదిస్తే వారిని తాము సమర్థిస్తామని రైతులు తెలిపారు. సొసైటీ అభ్యున్నతికి కట్టుబడి పనిచేసే వ్యక్తిని చైర్మన్‌గా ఎంపిక చేయాలని సంఘం పరిధిలోని ఐదు గ్రామాల రైతులు,సంఘం సభ్యుల తరఫున కోరారు.ఈ సమావేశంలో అగ్గు హనుమంతు,ఎస్‌. గోవిందు,శ్రీనివాస్‌, అల్లావుద్దీన్‌,జల్లయ్య,ఆనంద్‌,చందు,రవికుమార్‌,ఆనంద్‌ కుమార్‌,రమేష్‌,గోపి,అర్జున్‌,అన్వర్‌,శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.