మాకులపేటలో ఫామ్ పాండ్ పనుల పరిశీలన
మాకులపేటలో ఫామ్ పాండ్ పనుల పరిశీలన
దండేపల్లి, అక్టోబర్ 8, ప్రజావాణి: దండేపల్లి మండలంలోని మాకులపేట గ్రామపంచాయతీలో నిర్మాణంలో ఉన్న ఫామ్ పాండ్ పనులను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, మంచిర్యాల జిల్లా జలసిరి ప్రత్యేక అధికారి జలపతి, మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్ గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఫామ్ పాండ్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, విబిజి రామ్‌జీ పథకం కింద పనిచేస్తున్న కూలీలతో మాట్లాడారు. పథకం కింద లభిస్తున్న పనులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు, అందుబాటులో ఉన్న పనిదినాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కూలీలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మాకులపేట గ్రామ సర్పంచ్, ఎంపీడీవో జేడీ ప్రసాద్, ఏపీవో దుర్గాదాస్, ఈసీ భీమన్న, టీఏలు సుభాష్, జగన్, శ్రీనివాస్, రామ్‌కుమార్, అరవింద్ ఫీల్డ్ అసిస్టెంట్స్ రాజన్న శ్రీనివాస్ ప్రేమ్ సింగ్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
మాకులపేటలో ఫామ్ పాండ్ పనుల పరిశీలన
RELATED ARTICLES

