రోడ్డుకు ఇరువైపులా చెత్త తొలగింపు
వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
బెజ్జంకి, అక్టోబర్ 8 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ నుంచి గుగ్గిళ్ల గ్రామానికి వెళ్లే రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన చెత్తనుజాన్ డియర్ కోర యంత్రం సహాయంతో తొలగిస్తున్నారు.వాహనదారులకు, ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెత్త తొలగింపు పనులు చేపట్టారు.రహదారులు పరిశుభ్రంగా ఉండేలా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఈ చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, వార్డు సభ్యులు దూశెట్టి రాజిరెడ్డి, పంతంగి వెంకటేష్, గ్రామస్తులు తిరుపతిరెడ్డి, తడిసిన నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

