📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమహిళా విద్యార్థులపై వేధింపుల ఆరోపణలు

మహిళా విద్యార్థులపై వేధింపుల ఆరోపణలు

📰 Generate e-Paper Clip

మహిళా విద్యార్థులపై వేధింపుల ఆరోపణలు: కాంగ్రెస్ ఎంపీని తక్షణమే సస్పెండ్ చేయాలి
కులకచర్లలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా
పరిగి, అక్టోబర్12(ప్రజావాణి ):
మహిళా విద్యార్థులపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ అంగోంచా బిమోల్ అకోయిజాను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సౌమ్య రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు గణపురం వెంకటయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ నాయక్, సీనియర్ నాయకులు గిరిగంటి కేశవులు, హరికృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్ ముదిరాజ్, మండల అధ్యక్షులు గుడాల వెంకటేష్ తదితరులు మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులపై శారీరక, మానసిక వేధింపులకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చినా కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించకపోవడం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా మహిళల రక్షణ, హక్కులపై గళమెత్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తమ ఎంపీపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
మహిళల భద్రత, ఆత్మగౌరవానికి సంబంధించిన సున్నితమైన అంశాలలో రాజకీయాలు చేయకుండా తక్షణమే నిష్పక్షపాత విచారణ చేపట్టాలని, బాధితులకు న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాలు, వార్డు సభ్యురాలు ఉత్తర కుమారి, చాపలగూడెం సర్పంచ్ స్వప్న గోపాల్, మాజీ మండల అధ్యక్షులు జెమినీ సురేష్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడుసు మహిపాల్, మండల ప్రధాన కార్యదర్శులు సిహెచ్ హనుమంతు, పెరమళ్ళ వెంకట్, సీనియర్ నాయకులు నీరటి కర్ణయ్య, సుంకు మల్లేష్, రామస్వామి, సిహెచ్ వెంకట్రాములు, ఎన్నికల కో-కన్వీనర్ గాదె మల్లేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు బెందూరి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు కొండ అంజి, కృష్ణ చారి, రాములు, అంజితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.