శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ప్రారంభించిన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ
గుట్టల బేగంపేటలో నూతన ఆలయ ప్రారంభోత్సవం
మాదాపూర్ (ప్రజావాణి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గుట్టల బేగంపేట సున్నం చెరువు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు సీనియర్ నాయకులు శ్రీ ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ గారితో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. నూతనంగా నిర్మించిన దేవస్థానం ప్రారంభంతో స్థానిక భక్తుల్లో ఆనందం నెలకొంది. ఈ ఆలయం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భక్తుల పూజలకు కేంద్రంగా నిలవనుంది.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

