మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయం
*మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయం* మేడ్చల్, అక్షిత ప్రతినిధి: మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ జాము రవి అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ దేశానికి అందించిన సేవలను, అహింసా సిద్ధాంతాన్ని, సత్యం, శాంతి మార్గంలో ఆయన చూపిన బాటను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు నీరజ్ గౌడ్, నవీన్, అజయ్ కుమార్, ప్రభాకర్, రాజు, గోవర్ధన్ రెడ్డి,...