మద్దూరులో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
మద్దూరు అక్టోబర్31, ప్రజా వాణి,
జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశానుసారం
మద్దూరు మండలం కేంద్రంలో గల అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారెళ్ళ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను నిర్వహించారు.ఈకార్యక్రమానికి
ముఖ్య అతిధులుగా
చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు
అనంతరం ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో వైస్ చైర్మన్ బోయిన శ్రీనివాస్ డైరెక్టర్లు ఆరే వెంకటనారాయణ లకావత్ యాదగిరి సందిటి లక్ష్మి మరియు సిద్దిపేట జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి జక్కిరెడ్డి సుదర్శన్ రెడ్డి డిసిసి కార్యదర్శి పద్మా రెడ్డి
సర్పంచులు ఇట్టబోయిన కనకచంద్రం,పాల్తీయ రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు. కార్యదర్శులు గ్రామ శాఖ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు రైతు కమిటీ సభ్యులు యూత్ కాంగ్రెస్ నాయకులు నాయకులు తదితరులు అందరూ పాల్గొన్నారు.

