📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబెల్ట్‌ షాపులతో పల్లెల్లో కలకలం

బెల్ట్‌ షాపులతో పల్లెల్లో కలకలం

📰 Generate e-Paper Clip

*బెల్ట్‌ షాపులతో పల్లెల్లో కలకలం*

-అధికారులు పట్టుదలగా చర్యలు తీసుకుంటేనే అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట

మన ప్రజావాణి/ఎల్లారెడ్డిపేట

మండలంలోని గ్రామాల్లో బెల్ట్‌ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా ఇళ్లలో, కిరాణా దుకాణాల పరిసరాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో బెల్ట్‌ షాపుల కారణంగా యువత మద్యానికి బానిసవుతున్నారని, కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులతో పాటు గొడవలు పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*ఎంఆర్ పి మించి.. అదనపు వసూళ్లు*

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మద్యం విక్రయించాల్సి ఉండగా, కొందరు బెల్ట్‌ షాపుల నిర్వాహకులు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రివేళల్లోనూ యథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

*బెల్ట్‌ షాపు.. గ్రామానికి మరో సమస్య*

గ్రామాల్లో మద్యం విక్రయ కేంద్రాలు పెరగడంతో యువతతో పాటు పలువురు మద్యానికి అలవాటు పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో గొడవలు, కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతింటోందని వాపోతున్నారు.

*తండాల్లోనూ దందాలు.. బెల్ట్‌ షాపులపై ఎందుకు మౌనం?*

కొన్ని గ్రామాలు, తండాల్లో బెల్ట్‌ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

*నకిలీ మద్యం.. కొత్త మద్యం ఆరోపణలపై దృష్టి సారించాలి*

అక్రమంగా విక్రయించే మద్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

*ప్రభుత్వం.. అధికారులకు విజ్ఞప్తి*

గ్రామాల్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బెల్ట్‌ షాపులను గుర్తించి మూసివేయాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.