📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబతుకమ్మ వేడుకలకు గూనిపర్తి మైదానం ముస్తాబు

బతుకమ్మ వేడుకలకు గూనిపర్తి మైదానం ముస్తాబు

📰 Generate e-Paper Clip

బతుకమ్మ వేడుకలకు
గూనిపర్తి మైదానం ముస్తాబు
ఆడబిడ్డల కోసం ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు

ప్రజావాణి అక్టోబర్ 16 కమలాపూర్ మండలం గూనిపర్తి గ్రామంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేస్తున్నారు బతుకమ్మ ఆడే ప్రదేశాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి గ్రామాన్ని పండుగ శోభతో ముస్తాబు చేస్తున్నారు బతుకమ్మ వేడుకలు జరిగే గూనిపర్తి మైదానం ప్రాంతంలో వెలుగులు చిమ్మేలా ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేశారు రాత్రివేళ బతుకమ్మ ఆడే మహిళలు ఆడబిడ్డలకు చీకటి కారణంగా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా ఈ లైటింగ్ ఏర్పాట్లు చేసినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు ఆడబిడ్డల భద్రత సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ వేడుకలు జరిగే ప్రాంతంలో అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పండుగ సమయంలో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు
బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉండడంతో వెలుతురు భద్రత పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు గ్రామస్తులు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.