📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబతుకమ్మ దసరా పండుగల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు

బతుకమ్మ దసరా పండుగల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు

📰 Generate e-Paper Clip

*బతుకమ్మ దసరా పండుగల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు…*

*నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.*

*యాదాద్రి జిల్లా ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 09*

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ముందుగా బతుకమ్మ , దసరా పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ..పండుగల సమయంలో ఇబ్బందులు..ట్రాఫిక్ నివారించేందుకు ప్రయాణాలను ఒకటి , రెండు రోజుల ముందుగానే ప్లాన్ చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. జాతీయ రహదారుల పై వాహనాల రద్దీని నియంత్రించేందుకు బీబీ నగర్ , పంతంగి టోల్ ప్లాజాల వద్ద తగినంత పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. రహదారి నిర్మాణ పనులు జరుగు తున్న ప్రాంతాల్లో అప్ర మత్తంగా ఉండాలని , అతి వేగం , రాంగ్ రూట్ డ్రైవింగ్ , ప్రమాదకరమైన ఓవర్ టేకింగు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ , కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ను తప్పనిసరిగా ధరించాలని , మద్యం సేవించి వాహనాలు నడపవద్దని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రాధాన్య తని , ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని డీఎస్పీ యాదాద్రి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.