📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రైవేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్న మండల విద్యాధికారి

ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్న మండల విద్యాధికారి

📰 Generate e-Paper Clip

ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్న మండల విద్యాధికారి

* జమ్మికుంట ఎం ఈ ఓ కార్యాలయంలో ఏం జరుగుతోంది

* ఒక పాఠశాలపై పిర్యాదు వేస్తే మరో పాఠశాల యొక్క సమాధానం పంపుతున్న ఎం ఈ ఓ

* ఆర్ టి ఐదరఖాస్తుల నిర్వహణపై ఉన్నతాధికారులు తక్షణ విచారణ జరపాలి

* జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలిగట్టు సాయిరాం

జమ్మికుంట అక్టోబర్ 28 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణంలోని న్యూ జయభారతి పాఠశాలపై సమాచార హక్కు చట్టం (ఆర్.టి.ఐ) కింద దరఖాస్తు చేసిన గట్టు సాయిరాంకు, ఆ పాఠశాలకు సంబంధించిన సమాచారo కాకుండా మరొక్క పాఠశాల యొక్క సమాచారం పంపడం విద్యాశాఖకి సిగ్గు చేటు గా చెప్పవచ్చు ఒక పాఠశాల వివరాలు కోరితే మరో పాఠశాల సమాచారం ఎందుకు పంపించారో ఆ సమాచారాన్ని పంపించాలని ఎవరు నిర్ణయించారో ఏ రికార్డుల ఆధారంగా పంపించారో అసలు ఎం ఈ ఓకార్యాలయంలో ఆర్.టి.ఐ దరఖాస్తులను ఏ విధంగా పరిశీలిస్తున్నారో అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది అని గట్టు సాయిరాం అన్నారు
ప్రజలు పాఠశాలల నిర్వహణ, విద్యాశాఖ అధికారుల బాధ్యతలు, ప్రభుత్వ నిబంధనల అమలు గురించి తెలుసుకోవడానికి ఆర్.టి.ఐని ఆశ్రయిస్తారు. అలాంటి దరఖాస్తులకు సంబంధించిన సమాచారాన్ని అందించే విషయంలో స్పష్టమైన విధానం ఉండాలి. అయితే ఒక పాఠశాలపై సమాచారం కోరిన దరఖాస్తుదారుడికి, దరఖాస్తు చేయని మరో పాఠశాల సమాచారం కూడా పంపించడానికి గల కారణాలను ఎం ఈ ఓ కార్యాలయం ప్రజలకు వివరించాలని హెచ్చరించారు ఇది కార్యాలయ స్థాయిలో జరిగిన పొరపాటా లేక సమాచారాన్ని పంపడంలో విధివిధానాలు పాటించలేదా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే అంశాలపై ఉన్నతాధికారులు రికార్డులను పరిశీలించి వాస్తవాలను బయట పెట్టాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు అలగే సమాచారం పంపించామని చేతులు దులుపుకోవడం కాదు ఏ సమాచారం పంపించారో వివరించాల్సిన బాధ్యత మండల విద్యాధికారి తెలియజేయాలని కోరుతున్నాము జమ్మికుంట ఎం ఈ ఓ కార్యాలయం నుంచి అందిన సమాచారంపై తలెత్తిన ప్రశ్నలకు అధికారులు స్పష్టత ఇవ్వాలని, వెంటనే జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారాన్ని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి జమ్మికుంట మండల విద్యాధికారి వెంటనే వీధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.