ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన – డాక్టర్ రాహుల్
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రతి రోగి కి నాణ్యమైన వైద్య సేవలు అందేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా వైద్య & ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాహుల్ సూచించారు. బుధవారం చండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలును సమీక్షించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులైన బాలికలు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిరోధక (హెచ్ పి వి) టీకాను తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆయన సూచించారు. అనంతరం మందుల నిల్వలను, గడువు తేదీలను, పలు రికార్డులను పరిశీలించారు.
అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఆయన వెంట హెచ్ఈఈఓ అంజయ్య, రంజిత్, వైద్యాధికారి డాక్టర్ సంధ్య, హెల్త్ సూపర్వైజర్ వెంకటేశం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఉన్నారు.

