📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి:

పోరుమామిళ్ల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి:

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు

పోరుమామిళ్ల: వైఎస్సార్ జిల్లా అక్టోబర్ 7 ప్రజావాణి పోరుమామిళ్లలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సి.హెచ్.సి) మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి బుధవారం నాడు సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను తనిఖీ చేసిన ఆయన, రోగులకు అందుతున్న వైద్య సేవలను,మందుల లభ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక వసతులను ప్రజలందరూ తెలుసుకుని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కాకుండా ప్రభుత్వ వైద్య సేవలను ఉచితంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వైఎస్సార్, జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే ఆసుపత్రి అభివృద్ధి:

ఆసుపత్రి గత చరిత్రను, సాధించిన ప్రగతిని నాగార్జున రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ ప్రాంత ప్రజల అవసరాల కోసం దీనిని 30 పడకల ఆసుపత్రిగా మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ఆసుపత్రిని మరింత ఆధునీకరించి, 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశారని తెలిపారు. నూతన బిల్డింగ్ నిర్మాణంతో పాటు రోగులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులను సమకూర్చడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి:ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరతపై స్పందిస్తూ, ఇక్కడ మొత్తం 12 మంది డాక్టర్ల పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 7 మంది డాక్టర్లు మాత్రమే విధుల్లో ఉన్నారని నాగార్జున రెడ్డి తెలిపారు. మిగిలిన 5 ఖాళీ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేసి,ఈ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందేలా చూడాలని ఆయన ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరారు.ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సేవలు:ప్రస్తుతం పోరుమామిళ్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రైవేటుకు దీటుగా ఎన్నో రకాల వైద్య సేవలు, అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.

వైద్య పరీక్షలు: ఆసుపత్రిలో అత్యాధునిక ఎక్స్రే ప్లాంట్, ఈసీజీ  సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.

చిన్నపిల్లల వైద్యం: నవజాత శిశువులు, చిన్నపిల్లల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ‘ఫొటోథెరపీ’ సదుపాయం ఉంది.

ఖరీదైన అత్యవసర మందులు: గుండెపోటు (హార్ట్ ఎటాక్) వచ్చిన రోగుల ప్రాణాలు కాపాడేందుకు వాడే, దాదాపు రూ.40,000 విలువచేసే ‘టెన్ కే ప్లేజ్’ఇంజక్షన్లు ఇక్కడ ఉచితంగా అందుబాటులో ఉంచారు.రక్త నిల్వలు: అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అందించడానికి రక్తం కూడా నిరంతరం అందుబాటులో ఉంటోంది.ఉచిత వ్యాక్సిన్లు: కుక్క, కోతి, పిల్లి కాటుకు గురైన వారికి వేసే యాంటీ-రేబిస్ ఇంజక్షన్లు తగినన్ని నిల్వ ఉన్నాయి. స్పెషలిస్ట్ డాక్టర్లు: ఆసుపత్రిలో డెంటల్ (దంత), కంటి (ఆప్తాల్మాలజీ), గైనకాలజీ (స్త్రీ ప్రసూతి) విభాగాలకు సంబంధించిన నిపుణులైన డాక్టర్లు సేవలు అందిస్తున్నారు. కాన్పులు & ఆపరేషన్లు: గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో ఇక్కడ రెగ్యులర్‌గా కాన్పులు జరుగుతున్నాయని, అలాగే కుటుంబ నియంత్రణ (పిల్లలు కలగకుండా చేసే) ఆపరేషన్లు కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.గడిచిన 25 సంవత్సరాలుగా తాను ఎంపీపీగా,జెడ్పీటీసీగా,అలాగే ప్రభుత్వ సలహాదారుగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ.నిరంతరం ఆసుపత్రిని తనిఖీ చేస్తున్నానని నాగార్జున రెడ్డి చెప్పారు. ఆసుపత్రికి కావలసిన మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత,మౌలిక సదుపాయాల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తూ వస్తున్నానని స్పష్టం చేశారు.పోరుమామిళ్ల చుట్టుపక్కల ఉన్న మూడు మండలాల సామాన్య ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఆర్థికంగా నష్టపోవద్దని, ఇక్కడి వైద్య సేవలను లబ్ధిదారులుగా మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు,సిబ్బంది, స్థానిక నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.