పోరుమామిళ్ల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి:

ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు పోరుమామిళ్ల: వైఎస్సార్ జిల్లా అక్టోబర్ 7 ప్రజావాణి పోరుమామిళ్లలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సి.హెచ్.సి) మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి బుధవారం నాడు సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను తనిఖీ చేసిన ఆయన, రోగులకు అందుతున్న వైద్య సేవలను,మందుల లభ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక వసతులను ప్రజలందరూ తెలుసుకుని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కాకుండా ప్రభుత్వ వైద్య సేవలను ఉచితంగా సద్వినియోగం...