📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల జపమాలరాగ్ని తిరునాళ్లలో సందడి - ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లూరు బిషప్పా శ్రీ శ్రీ...

పోరుమామిళ్ల జపమాలరాగ్ని తిరునాళ్లలో సందడి – ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లూరు బిషప్పా శ్రీ శ్రీ ఎండి ప్రకాశం తండ్రి

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల అక్టోబర్7ప్రజావాణి మండల కేంద్రంలోని పురాతన కాథలిక్ దేవాలయంలో కొలువైన పరిశుద్ధ జపమాలరాగ్ని మాత వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా,కన్నులపండువగా జరిగాయి. గత మూడు రోజులుగా అంటే అక్టోబర్ 5,6,7 తేదీలలో నిర్విరామంగా సాగిన ఈ వేడుకలు బుధవారం మూడవ రోజున ప్రత్యేక దివ్యబలిపూజ, దివ్య సత్ప్రసాద ఆశీర్వచనంతో భక్తిమయంగా ముగిశాయి.ఈ తిరునాళ్లకు కేవలం పోరుమామిళ్ల మండలం నుండే కాకుండా వై.ఎస్.ఆర్.కడప జిల్లా నలుమూలల నుండి, పొరుగున ఉన్న నెల్లూరు,ప్రకాశం,అన్నమయ్య జిల్లాల నుండి వేలాది మంది క్రైస్తవ విశ్వాసులు తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా నెల్లూరు పీఠాధిపతులుమూడవ రోజు ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా నెల్లూరు రోమన్ కాథలిక్ పీఠాధిపతులు మహా పూజ్య శ్రీ శ్రీ శ్రీ ఎండి ప్రకాశం తండ్రి. విచ్చేశారు.పీఠాధిపతులు చర్చికి విచ్చేయగానే పోరుమామిళ్ల విచారణ గురువులు,చర్చి కమిటీ సభ్యులు, కతోలిక యువజన సంఘం సభ్యులు సంప్రదాయ బ్యాండ్ మేళాలతో, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం చర్చిలో ప్రత్యేక దివ్యబలిపూజ నిర్వహించారు.ఈ బలిపూజకు పీఠాధిపతులు ప్రధాన యాజకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన దైవ సందేశాన్ని అందిస్తూ.పరిశుద్ధ జపమాలరాగ్ని మాత జీవితం మనందరికీ ఆదర్శం.ఆమె చూపిన భక్తి, వినయం,విధేయత,త్యాగనిరతిని ప్రతి క్రైస్తవ కుటుంబం అలవర్చుకోవాలి.నేటి కాలంలో కుటుంబాలలో ప్రార్థన తగ్గిపోతోంది.కుటుంబం కలిసి ప్రార్థన చేసినప్పుడే ఆ కుటుంబంలో శాంతి,సమాధానం,సంతోషం వెల్లివిరుస్తాయి” అని ఉద్ఘాటించారు.జపమాల ప్రార్థన యొక్క విశిష్టతను వివరిస్తూ, ప్రతి రోజు జపమాల చేయడం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం పోరుమామిళ్ల విచారణ ప్రజలందరికీ,తిరునాళ్లకు విచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు.పాల్గొన్న పూజ్య గురువులుఈ మూడు రోజుల తిరునాళ్ల మహోత్సవాలను విజయవంతం చేయడంలో పోరుమామిళ్ల విచారణ గురువులు మరియు డీన్ రెవరెండ్ ఫాదర్ విజయభాస్కర్ జాల  కీలక పాత్ర పోషించారు.వారితో పాటు రెవరెండ్ ఫాదర్ సునీల్,సహాయ గురువులు రెవరెండ్ ఫాదర్ డేవిడ్,చుట్టుపక్కల విచారణల నుండి విచ్చేసిన 15 మంది గురువులు ఈ బలిపూజలో పీఠాన్ని పంచుకుని దేవుని వాక్యాన్ని బోధించారు.మూడు రోజులు కనులపండువగా వేడుకలుమొదటి రోజు (అక్టోబర్ 5) పరిశుద్ధ జెండా ఆవిష్కరణ (ధ్వజారోహణం) తో తిరునాళ్లు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.సాయంత్రం ప్రత్యేక జపమాల ప్రార్థనలు,దివ్యబలిపూజ జరిగింది.రెండవ రోజు (అక్టోబర్ 6)ఈ రోజు వేడుకల్లో ప్రధాన ఘట్టమైన కన్యకా మరియమ్మ వైభవ రథోత్సవం (తేరు ఊరేగింపు) జరిగింది. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన మాత రథాన్ని పోరుమామిళ్ల పురవీధుల్లో ఊరేగించారు.బ్యాండ్ మేళాలు,తప్పెట్లు, భక్తి కీర్తనల నడుమ”జపమాలరాగ్ని మాతాకీ జై” అంటూ భక్తులు చేసిన జయజయధ్వానాలతో పోరుమామిళ్ల పట్టణం మార్మోగిపోయింది.మూడవ రోజు (అక్టోబర్ 7) పీఠాధిపతుల దివ్యబలిపూజ,దివ్య సత్ప్రసాద ఆశీర్వాదం మరియు ధ్వజావరోహణంతో వేడుకలు ముగిశాయి.ఈ మూడు రోజులు చర్చి ప్రాంగణమంతా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో, పూలతో దేదీప్యమానంగా వెలిగిపోయింది.ఏర్పాట్లు అభినందనీయంభక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్చి కమిటీ పెద్దలు మంచినీటి సౌకర్యం,చలువ పందిళ్లు,కూర్చునే ఏర్పాట్లు చేశారు.

పోలీసుల సహకారంతో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.వేడుకల అనంతరం విచ్చేసిన వేలాది మంది భక్తులకు చర్చి కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ తిరునాళ్లను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ,విశ్వాసులకు,దాతలకు,యువజన సంఘానికి ఫాదర్ విజయభాస్కర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.