పోరుమామిళ్ల జపమాలరాగ్ని తిరునాళ్లలో సందడి – ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లూరు బిషప్పా శ్రీ శ్రీ ఎండి ప్రకాశం తండ్రి

పోరుమామిళ్ల అక్టోబర్7ప్రజావాణి మండల కేంద్రంలోని పురాతన కాథలిక్ దేవాలయంలో కొలువైన పరిశుద్ధ జపమాలరాగ్ని మాత వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా,కన్నులపండువగా జరిగాయి. గత మూడు రోజులుగా అంటే అక్టోబర్ 5,6,7 తేదీలలో నిర్విరామంగా సాగిన ఈ వేడుకలు బుధవారం మూడవ రోజున ప్రత్యేక దివ్యబలిపూజ, దివ్య సత్ప్రసాద ఆశీర్వచనంతో భక్తిమయంగా ముగిశాయి.ఈ తిరునాళ్లకు కేవలం పోరుమామిళ్ల మండలం నుండే కాకుండా వై.ఎస్.ఆర్.కడప జిల్లా నలుమూలల నుండి, పొరుగున ఉన్న నెల్లూరు,ప్రకాశం,అన్నమయ్య జిల్లాల నుండి వేలాది మంది క్రైస్తవ విశ్వాసులు తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులతో...