పెరిక సింగారంలో ఘనంగా మహా అన్నదానం
దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
కూసుమంచి అక్టోబర్ 15, ప్రజావాణి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరిక సింగారం గ్రామంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్ రావు హాజరయ్యారు.
గ్రామానికి చేరుకున్న ముఖ్య అతిథులకు ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారి చేతుల మీదుగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఇంటూరి పుల్లయ్య, చాట్ల పరుశురాం, గ్రామ సర్పంచ్ కందునూరి మంగమ్మ, మల్లేశ్వరరావు, ఈర్ల నాగేశ్వరరావు, ఉమ, పంచాయతీ కార్యదర్శి సుస్మిత, కందునూరి ఏడుకొండలు, కందునూరి లక్ష్మీనారాయణ, ఈర్ల నరేష్, వీరబాబు, బాదంశెట్టి శ్రీనివాస్, ఈర్ల తరుణ్, బండారు శ్రీనివాస్, రావు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పెరిక సింగారంలో ఘనంగా మహా అన్నదానం
RELATED ARTICLES

