పెరిక సింగారంలో ఘనంగా మహా అన్నదానం
పెరిక సింగారంలో ఘనంగా మహా అన్నదానం దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం కూసుమంచి అక్టోబర్ 15, ప్రజావాణి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరిక సింగారం గ్రామంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్ రావు హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న ముఖ్య అతిథులకు ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు....