పీర్జాదిగూడ 10వ డివిజన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా శాంసన్ జార్జ్….నియామక పత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
పీర్జాదిగూడ, సెప్టెంబర్ 30 (ప్రజావాణి): మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మేడికొండ శాంసన్ జార్జ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శాంసన్ జార్జ్‌ను వజ్రేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ కావలి చంద్రయ్య అభినందించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు శాంసన్ జార్జ్ కృతజ్ఞతలు తెలిపారు....