📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపాలకుర్తిలో FZ మొబైల్ షాప్ ను ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తిలో FZ మొబైల్ షాప్ ను ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

📰 Generate e-Paper Clip

పాలకుర్తిలో FZ మొబైల్ షాప్ ను ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన FZ మొబైల్ షాప్ ప్రారంభోత్సవ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి హాజరయ్యారు.

ముందుగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి షాప్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షాప్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక మోడల్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, మొబైల్ యాక్ససరీస్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. పాలకుర్తి ప్రాంతంలో యువ పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి ఇలాంటి నూతన వ్యాపారాలు ప్రారంభించడం హర్షణీయమన్నారు. నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యావసరంగా మారిందని, అలాంటి సేవలను ప్రజలకు నాణ్యతతో, సరసమైన ధరలకే అందించాలని నిర్వాహకులకు సూచించారు.

నమ్మకమే వ్యాపారానికి పెట్టుబడి అని, వినియోగదారులకు మెరుగైన సేవలు, వారంటీ సేవలు అందించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. FZ మొబైల్ షాప్ దినదినాభివృద్ధి చెంది, తమ వ్యాపారాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.

పాలకుర్తి మండల కేంద్రం గతంలో కంటే వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రభుత్వం అన్ని వర్గాల వ్యాపారులకు అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో FZ మొబైల్ షాప్ నిర్వాహకులు, పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు, యువకులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.