పాపయ్యపల్లిలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
బెజ్జంకి, అక్టోబర్ 9 (ప్రజావాణి):
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని పాపయ్యపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మను పూలతో అందంగా అలంకరించి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని మహిళలు సంప్రదాయాలను కాపాడుకుంటూ పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు.అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ భావన, వార్డు సభ్యులు తిప్పారపు మహేష్, లోనే నర్సింగరావు, అంగన్వాడీ టీచర్ జమున తదితరులు పాల్గొన్నారు.

