📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅడ్వకేట్ సల్మాన్ రాజ్ గుండెపోటుతో మృతి – బార్ అసోసియేషన్ సంతాపం

అడ్వకేట్ సల్మాన్ రాజ్ గుండెపోటుతో మృతి – బార్ అసోసియేషన్ సంతాపం

📰 Generate e-Paper Clip

అడ్వకేట్ సల్మాన్ రాజ్ గుండెపోటుతో మృతి – బార్ అసోసియేషన్ సంతాపం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): జనగామ కోర్టు అడ్వకేట్ సల్మాన్ రాజ్ నిన్న గుండెపోటు వచ్చి అకాల మరణం చెందడం పట్ల జనగామ బార్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సంతాపంగా సోమవారం జనగామ కోర్టులో న్యాయవాదులందరూ విధులను బహిష్కరించారు.

ఈ సందర్భంగా జనగామ బార్ అధ్యక్షులు బండా దయాకర్ రెడ్డి సబ్ కోర్టులో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సంతాప సభకు సీనియర్ సివిల్ జడ్జి జనగామ శంకరి శ్రీదేవి ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జనగామ శేషి హాజరై, సల్మాన్ రాజ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు.

అనంతరం బార్ రూములో సల్మాన్ రాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బండా దయాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. న్యాయవాదులు తమ వృత్తి పరంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని కోరారు. జమాల్ షరీఫ్ అడ్వకేట్ మాట్లాడుతూ.. సల్మాన్ రాజ్ చిన్న వయసులోనే చనిపోవడం చాలా బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. సల్మాన్ రాజ్ చాలా సిన్సియర్ లాయర్ అని, ఎవరికీ ఎలాంటి బాధ, ఇబ్బంది పెట్టేవారు కాదని గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ ప్రసాద్ రావు, బార్ అసోసియేషన్ సెక్రటరీ మన్నె సత్తయ్య, సీనియర్ న్యాయవాదులు చంద్ర ఋషి , నాగరాజ్ శర్మ, జమాల్ షరీఫ్, శ్రీనివాస్ రెడ్డి, వజ్జులు, సాదిక్ అలీ అడ్వకేట్, గాజుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.