📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పరిశోధనకు కొత్త దిశ.విద్యార్థులకు స్ఫూర్తి!జీవ శాస్త్ర పరిశోధనలో విశిష్ట కృషి చేస్తున్న డా. డి. వీర...

పరిశోధనకు కొత్త దిశ.విద్యార్థులకు స్ఫూర్తి!జీవ శాస్త్ర పరిశోధనలో విశిష్ట కృషి చేస్తున్న డా. డి. వీర నాగేంద్ర కుమార్

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల ప్రజావాణి (అక్టోబర్ 29): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డా.డి.వీర నాగేంద్ర కుమార్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పరిశోధన రంగంలో విశేష కృషి చేస్తూ యువ పరిశోధకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుండి జంతుశాస్త్రంలో పీహెచ్.డీ. పూర్తి చేసిన ఆయన,మధుమేహం వల్ల మెదడులో ఏర్పడే ఆక్సిడేటివ్ ఒత్తిడి,యాంటీ ఆక్సిడెంట్ స్థితి, శక్తి జీవక్రియ అంశాలపై సహజ ఔషధ మొక్కల ప్రభావంపై అధ్యయనం చేశారు.యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులతో మధ్యపానం వల్ల మెదడులో వచ్చే దుష్పరిణామాలపై పరిశోధనలు నిర్వహించారు. ఇప్పటివరకు 70కి పైగా పరిశోధనా వ్యాసాలు స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్ ఇండెక్స్ కలిగిన అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురించారు.అలాగే 2 పాఠ్య పుస్తకాలు,20 పుస్తక అధ్యాయాలను రచించారు.యోగి వేమన విశ్వవిద్యాలయం పరిశోధకులకు మార్గదర్శకుడిగ , మలేషియా టెరెంగాను విశ్వవిద్యాలయ విద్యార్థుల పరిశోధనలకు ఎగ్జామినర్ గా వ్యవహరిస్తున్నారు.శాస్త్రీయ విజ్ఞానాన్ని విద్యార్థులు, పరిశోధకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ‘ఫ్రాంటియర్స్ ఇన్ మోడరన్ బయాలజీ’, ‘సింఫనీ ఆఫ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్’ వంటి పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక సదస్సులను నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పిస్తున్నారు. పరిశోధనను సాంకేతిక ఆవిష్కరణల వైపు తీసుకెళ్తూ మూడు పేటెంట్లకు దరఖాస్తు చేశారు. సుస్థిర పర్యావరణ వ్యవస్థల కోసం సమగ్ర వన్యప్రాణి నిర్వహణ వ్యవస్థ, ప్రిడిక్టివ్ కార్డియాలజీలో నానోపార్టికల్స్ కు సంబంధించిన డీప్ లెర్నింగ్ విధానం,దీర్ఘకాలిక గుండె సంబంధిత వ్యాధుల్లో క్యాచెక్సియా ప్రభావాన్ని అంచనా వేసే విధానం వాటిలో ఉన్నాయి.‏ఇండియన్ జువాలాజికల్ వెల్ఫేర్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా,పలు శాస్త్రీయ సంస్థల్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ తో పాటు అంతర్జాతీయ పరిశోధక జర్నల్స్ అయినా,జర్నల్ ఆఫ్ ఎక్స్పరిమెంటల్ జువాలజీ ఇండియా, బయో కెమికల్ అండ్ సెల్లులార్ ఆర్చివ్స్, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ జువాలజీ అండ్ అప్లై బయోసైన్స్, జర్నల్ ఆఫ్ డైవర్సిటీ స్టడీస్ లకు ఎడిటోరియాల్ మెంబర్ గ వున్నారు.14 అంతర్జాతీయ జర్నల్స్ కు పరిశోధక వ్యాసాలకు సమీక్షకుడిగా సేవలందిస్తున్నారు.ఆయన కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ వారిచే స్టేట్ బెస్ట్ రీసెర్చ్ పబ్లికేషన్ అవార్డు, ఫ్రాన్స్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో యంగ్ జువాలజిస్ట్ అవార్డు, అకాడమీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ లైఫ్ సైన్సెస్, న్యూఢిల్లీ వారిచే యంగ్ సైంటిస్ట్ అవార్డు, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారిచే గ్లోబల్ యూత్ ఐకాన్ అవార్డు, మలేషియాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎమినెంట్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు. ఎం.ఎస్సీ జంతుశాస్త్ర ప్రవేశ పరీక్షలో ప్రథమ ర్యాంకు సాధించినందుకు ప్రొఫెసర్ ఇందిరా శ్రీరామ్ నగదు బహుమతిని పొందారు. డాక్టర్ వీర నాగేంద్రకుమార్ డిగ్రీ అధ్యాపక పరీక్ష ఫలితాలలో కూడా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకును సాధించడం జరిగింది విద్య, పరిశోధన, శాస్త్రీయ ప్రచురణలు, పుస్తక సంపాదకత్వం,పేటెంట్లు, సదస్సుల నిర్వహణ వంటి విభిన్న రంగాల్లో డా.డి.వీర నాగేంద్ర కుమార్ చేస్తున్న కృషి విద్యార్థులకు,యువ పరిశోధకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.శాస్త్రీయ పరిశోధనను బోధనతో అనుసంధానం చేస్తూ విద్యార్థుల్లో పరిశోధనా ఆసక్తిని పెంపొందించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.