📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

📰 Generate e-Paper Clip

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 15(ప్రజావాణి):
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హన్మకొండలోని మడికొండ సత్యసాయి గార్డెన్‌లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం అత్యంత ఉత్సాహంగా, సందడిగా సాగింది. ఈ సమావేశంలో పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య నాయకురాలిగా పాల్గొన్నారు.

ఈ సమావేశానికి పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, తొర్రూర్, రాయపర్తి పెద్దవంగర, మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, NSUI, సేవాదళ్ నాయకులు భారీగా హాజరై తమ హాజరును నమోదు చేసుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గ శ్రేణుల భారీ హాజరుతో సమావేశ ప్రాంగణం కాంగ్రెస్ జెండాలు, నినాదాలతో మారుమోగింది.
ఈ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి హాజరయ్యారు. వారితో పాటు ఉమ్మడి మూడు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రచార వ్యూహాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పట్టభద్రులు, యువత కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి పట్టభద్రుడి వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.