📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనోముల గ్రామంలో రైతు పొలంబడి కార్యక్రమం

నోముల గ్రామంలో రైతు పొలంబడి కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*నోముల గ్రామంలో రైతు పొలంబడి కార్యక్రమం*

*వరి పంటలో సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు*

*రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 8 (ప్రజావాణి)మంచాల* : మండలంలోని నోముల గ్రామంలో రైతు పొలాల వద్ద వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ), వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు క్షేత్ర పాఠశాల ‘పొలంబడి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరి పంట ప్రస్తుత దశలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. వరి పంట ప్రస్తుత దశల్లో కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తెల్ల కంకులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. తెల్ల కంకులు రాకుండా ఉండేందుకు చిరుపొట్ట దశలో, పొట్ట వచ్చే ముందు కార్టప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోలు లేదా కార్బోఫ్యూరాన్ 10 కిలోలను 20 కిలోల ఇసుకలో కలిపి పొలంలో చల్లుకోవాలని సూచించారు. పిచికారీ చేయాల్సి వస్తే కార్టప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్‌పీ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు.

అదేవిధంగా వరి పంటలో ఈ దశలో అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ తెగులు సోకినప్పుడు ఆకులపై మధ్యలో బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయని, ఈ మచ్చలు గుండ్రంగా లేదా కండె ఆకారంలో ఉంటాయని తెలిపారు. ఆకులు ఎండిపోయి తగులబడినట్లుగా కనిపిస్తాయని చెప్పారు. పిలకల కొన పుల్లల వద్ద ఈ తెగులు ఆశిస్తే ఆ ప్రాంతంలో పిలక విరిగి వాలిపోతుందని వివరించారు.

మెడవిరుపు దశలో వెన్ను కంకి మెడ భాగంలో తెగులు ఆశించడం వల్ల వెన్నులు విరిగి కిందకు వాలిపోతాయని తెలిపారు. అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 75 శాతం డబ్ల్యూపీ 0.6 గ్రాములు లీటరు నీటికి లేదా ఐసోప్రోథియోలేన్ 40 శాతం ఈసీ 1.5 మి.�

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.