నీలం మధు ముదిరాజ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి.
జుక్కల్ నియోజకవర్గ కౌలాస్ గ్రామ సర్పంచ్ విద్యా బలరాం డిమాండ్.
. తెలంగాణలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోట ఎమ్మెల్సీ బిసి ముద్దుబిడ్డ ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయించాలని బిసి కౌలాస్ గ్రామ ముదిరాజ్ సర్పంచ్ విద్యా బలరాం..
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 16
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న గవర్నర్ కోటలోని ఎమ్మెల్సీ పదవిని బిసి సామాజిక వర్గానికి చెందిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీసీ ముద్దుబిడ్డ ముదిరాజ్ నీలం మధు ముదిరాజ్ కు కేటాయించాలని జుక్కల్ నియోజకవర్గ జుక్కల్ మండలంలోని కౌలస్ గ్రామ సర్పంచ్ విద్యా బలరాం డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గం కౌలాస్ గ్రామ సర్పంచ్ విద్యా బలరాం. మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్రం సుమారు 60 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి గుర్తించి, ముదిరాజ్ లకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా అవకాశం కల్పించాలని కోరారు. బీసీల్లో అత్యంత వేనుకబడిన కులం ముదిరాజ్ వర్గానికి గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఇస్తే వర్గానికి గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఆ వర్గానికి తగిన న్యాయం చేసినట్లు అవుతుంది అన్నారు..
….. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు నీలం మధు ముదిరాజ్
నీలం మధు ముదిరాజ్ నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. అన్న అంటే నేనున్నానంటూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలిచే గొప్ప మనసున్న నాయకుడు నీలం మధు ముదిరాజ్ అని ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ముదిరాజ్ సామాజిక వర్గంలో పాటు బీసీలందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. కావున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలు చొరవ తీసుకొని నీలం మధు ముదిరాజ్ కు ఎమ్మెల్సీ స్థానం కల్పించాలని బీసీలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యత కల్పించాలని కౌలాస్ గ్రామ సర్పంచ్ విద్య బలరాం విజ్ఞప్తి చేశారు..

