📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనర్సాయపల్లి గ్రామ అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం సర్పంచ్ సత్యనారాయణ

నర్సాయపల్లి గ్రామ అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం సర్పంచ్ సత్యనారాయణ

📰 Generate e-Paper Clip

నర్సాయపల్లి గ్రామ అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం సర్పంచ్ సత్యనారాయణ

నరసాయపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

గ్రామ బురుజుకు త్రివర్ణ పతాకం సోయగాలు

మద్దూరు అక్టోబర్17, ప్రజా వాణి,

మండలంలోని నరసయ్య పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామ సర్పంచ్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు శనిగరం సత్యనారాయణ అన్నారు. ఎందరో సర్పంచులు వచ్చినా గాని తమ స్వార్థం కోసం పనిచేసి గ్రామాన్ని పట్టించుకోలేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచిగా ఎన్నికైన శనిగరం సత్యనారాయణ రెండవ రోజు నుండే గ్రామ అభివృద్ధి పై దృష్టి సారించి అహర్నిశలు శ్రమిస్తూ గ్రామంలోని ప్రజలతో మమేకమై పాల్గా పాలకవర్గంతో కలిసి గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను తమ దృష్టికి తీసుకొని త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, సిసి రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, వీధులలో రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, మహిళ సంఘాల భవనాలు నిర్మించడంలో సర్పంచ్ కృషి ఎంతో అభినందనీయమని గ్రామస్థులు కొనియాడుతున్నారు. అదే విధంగా నైజం కాలంలో రజాకార్లు నిర్మించిన బురుజు శిధిలావస్థకు చేరుకుంటున్న సమయంలో త్రివర్ణ పతాకం సోయగాలతో గ్రామ ప్రజలకు బంధువుల కన్నులకు కను విందు చేసిన సర్పంచ్ పని తీరుకు అధికారులు, మండల ప్రజలు సర్పంచ్ సత్యనారాయణను ప్రశంసిస్తున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ ప్రజావాణి ప్రతినిధితో మాట్లాడుతూ తనపై నమ్మకంతో 350 పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలకు ఉన్న ప్రతి సమస్యను తీర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. పాలకవర్గం, గ్రామస్థుల సహకారంతో గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ప్రస్తుతం బతుకమ్మ, దసరా పండుగలను మహిళలు,పురుషులు, యువతి యువకులు, ఆనందోత్సవాల మధ్య సంతోషంగా జరుపుకోవాలని అందరికీ దసరా,బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.