📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణధర్మసాగర్‌పల్లిలో ప్రజాప్రతినిధుల చిత్రపటాల దహనం

ధర్మసాగర్‌పల్లిలో ప్రజాప్రతినిధుల చిత్రపటాల దహనం

📰 Generate e-Paper Clip

ధర్మసాగర్‌పల్లిలో ప్రజాప్రతినిధుల చిత్రపటాల దహనం

ఆరుగురిపై కేసు నమోదు

హుస్నాబాద్ ఏసిపి సదానందం

బెజ్జంకి,కోహెడ, అక్టోబర్ 21 (ప్రజావాణి):

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని కోహెడ పోలీస్ స్టేషన్ పరిధి ధర్మసాగర్‌పల్లి గ్రామంలో ప్రజాప్రతినిధుల చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీని దహనం చేసిన ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు.
గ్రామ సర్పంచ్ కరివేద చంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అక్టోబర్ 20న రాత్రి దసరా వేడుకల సందర్భంగా గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద కొందరు యువకులు ముందస్తు అనుమతి లేకుండా గుమిగూడినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ చిత్రాలతో రావణాసురుడి రూపంలో ఫ్లెక్సీ తయారు చేయించి దహనం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కోహెడలోని మణికంఠ ఫ్లెక్సీ ప్రింటర్స్ నిర్వాహకుడు ఎండీ ఆరిఫ్ సహాయంతో ఫ్లెక్సీ తయారు చేయించినట్లు, దాన్ని దహనం చేసి వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటనపై కోహెడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆరుగురిపై కేసు

ఈ ఘటనకు సంబంధించి ధర్మసాగర్‌పల్లికి చెందిన పోతరవేణి రాకేష్, లోనే హరీష్, మొతుకురు శ్రీకాంత్, గొండ అజయ్ కుమార్ అలియాస్ అభి, బండ అభిషేక్‌తో పాటు కోహెడకు చెందిన మణికంఠ ఫ్లెక్సీ ప్రింటర్స్ నిర్వాహకుడు ఎండీ ఆరిఫ్‌పై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు.సామాజిక మాధ్యమాల ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా,వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీపీ సదానందం హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.