ద్వారకలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ
ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
దండేపల్లి, అక్టోబర్ 16 (ప్రజావాణి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం దండేపల్లి మండలంలోని ద్వారక గ్రామ పంచాయతీలో జీపీఓ వెంకటస్వామి పంచాయతీ కార్యదర్శి
సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మురిమడుగు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు రేషన్ సేవలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కస్తూరి హారిక వెంకటేష్, గ్రామ రేషన్ డీలర్ తోట సంగీత, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు మన్నె సువర్ణ, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

