📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదేవరుప్పుల నూతన ఎస్సై చింత రాజు కి కాంగ్రెస్ గిరిజన నాయకుల సన్మానం

దేవరుప్పుల నూతన ఎస్సై చింత రాజు కి కాంగ్రెస్ గిరిజన నాయకుల సన్మానం

📰 Generate e-Paper Clip

దేవరుప్పుల నూతన ఎస్సై చింత రాజు కి కాంగ్రెస్ గిరిజన నాయకుల సన్మానం

లంబాడా గిరిజన సమస్యలపై తక్షణమే స్పందించాలని వినతి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 22(ప్రజావాణి): జనగామ జిల్లా, దేవరుప్పుల మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై చింత రాజు కి దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానం చేశారు.

మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా కప్పి, పూలమాలతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాయకులు ఎస్సై తో మండలంలోని ప్రస్తుత పరిస్థితులు, శాంతి భద్రతల అంశంపై చర్చించారు.
ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి భానోత్ భాస్కర్ నాయక్ మాట్లాడుతూ “దేవరుప్పుల మండలం గిరిజన ప్రాంతం. ఇక్కడ లంబాడా గిరిజనులు అధికంగా ఉన్నారు. గత కొంతకాలంగా లంబాడాలకు సంబంధించిన భూ సమస్యలు, సామాజిక సమస్యలు, యువతపై అకారణంగా కేసులు నమోదవడం వంటి సమస్యలు ఉన్నాయి. వీటిపై పోలీసు శాఖ మానవతా దృక్పథంతో స్పందించాలి. ప్రజలకు అందుబాటులో ఉండి ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని” కోరారు.

ముఖ్యంగా లంబాడా తండాల్లో పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలని, ఎవరైనా ఫిర్యాదుతో వస్తే వెంటనే స్పందించి న్యాయం చేయాలని, శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్సై రాజు సానుకూలంగా స్పందిస్తూ, తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటానని, చట్టాన్ని గౌరవిస్తూ, ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ న్యాయం చేస్తానని, గిరిజన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో
డీసీసీ ప్రధాన కార్యదర్శి భానోత్ భాస్కర్ నాయక్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సజ్జన్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు లకావత్ భాగ్య నాయక్, బానోత్ మహేందర్ నాయక్, ధరావత్ అనిత-రవీందర్ నాయక్, బానోత్ సుధాకర్ నాయక్, ధరావత్ సుజాత-యాకన్న నాయక్, ఉప సర్పంచ్ జరుప్ల శ్రీకాంత్ నాయక్, మరియు వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు బానోత్ శ్రీనివాస్ నాయక్, మూడ అశోక్ నాయక్, బానోత్ శ్రీను నాయక్, భూక్య వీరేష్ నాయక్, సీనియర్ నాయకులు గుగులోతు నరేందర్ నాయక్, బోడ యాకన్నా నాయక్, నునావత్ నరసింహ నాయక్, గుగులోతు రాజేందర్ నాయక్, బోడ రాజేందర్ నాయక్, యూత్ అధ్యక్షులు భానోత్ సంతోష్ నాయక్, నునావత్ అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.